The new secretariat should be named Ambedkar : Bandi Sanjay
mictv telugu

కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలి : బండి సంజయ్

September 14, 2022

తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముందు ఇక్కడ పేరు పెట్టిన తర్వాత పార్లమెంటు పేరు గురించి మాట్లాడాలని కేటీఆర్‌కు సూచించారు. అసెంబ్లీలో అంబేద్కర్ ఫోటో తీసేసి కేసీఆర్ తన ఫోటో పెట్టుకున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్ కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల మీద చర్చించాల్సిన అసెంబ్లీలో రాజకీయాలు మాట్లాడడం కేసీఆర్‌కే చెల్లిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే ఒక ఎమ్మెల్యేను జైలుకి, మరో ఎమ్మెల్యని సభ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఈ అంశాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు. అటు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసిన వీఆర్ఏలపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని, బర్రెను కొట్టినట్టు కొట్టారని దుయ్యబట్టారు. ప్రగతిభవన్ సందర్శకుల జాబితాలో ఓవైసీ పేరు తప్ప ఇతరుల పేర్లు కనిపించవని, దమ్ముంటే ఆ జాబితాను బయటపెట్టాలని సవాల్ చేశారు.