మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు ఇద్దరు కలిసి నటిస్తున్న తాజా సినిమా ఆచార్య నుంచి ‘భలే భలే బంజారా’ పాట వీడియోను చెప్పినట్టే ఇవ్వాళ విడుదల చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో, మణిశర్మ సంగీత సారథ్యం వహించిన ఈసినిమా పాటలు జనాలను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వచ్చిన పాటలో నక్సలైట్ వేషధారణలో తండ్రీకొడుకులిద్దరూ ఒకే స్క్రీన్‌పై డ్యాన్సులు చేయడం అభిమానులకు కనువిందుగా ఉంది. కాగా, ఈ నెల 29న రిలీజవుతోన్న ఆచార్య చిత్రంపై భారీ అంచనాలున్నాయి.