సోషల్ మీడియా వచ్చాక జనం ఆలోచనలకు సంకెళ్లు తెగిపోయాయి. ఏం కావాలన్నా క్షణాల్లో అందుబాటులో ఉండడంతో దీని వాడకం కూడా బాగా పెరిగిపోయింది. ఈ మధ్య చాలా మంది షార్ట్ వీడియోలు, రీల్స్ అంటూ తమకు తోచిన కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు. ఇందులో వెరైటీగా ఉండే వీడియోలకు జనాలు కూడా బానే లైకులతో ఆదరిస్తున్నారు. కానీ కొందరికి లైకుల పిచ్చి పట్టి ఏం పోస్ట్ చేస్తున్నామనే సోయి కూడా లేకుండా పోయింది. దీనికి నిదర్శనంగా నిలిచే ఓ వీడియో నెటిజన్ల కంట పడింది. కొత్తగా పెళ్లయిన దంపతులు తమ ఫస్ట్ నైట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వివాహం తర్వాత నాలుగు గోడల మధ్య జరిగే పవిత్ర కార్యం శోభనాన్ని కూడా వదలకుండా ఆ నవజంట అరాచకానికి తెరతీశారు.
Aur kya dekhna baki hai pic.twitter.com/3Tn6T1JWID
— Anaaya (@Mainhumadhubala) February 3, 2023
గదిలోకి ఎంటర్ కాగానే అదేదో పబ్లిక్ కార్యం అన్నట్టు దర్జాగా ఏమాత్రం సిగ్గూ శరం లేకుండా కెమెరా ఆన్ చేసి తమ ముద్దు, ముచ్చట, బట్టలు విప్పడం అన్నీ రికార్డు చేసుకున్నారు. సరే ఏదో గుర్తుగా అలా వీడియో తీసి పెట్టుకున్నారు. భవిష్యత్తులో వారు చూసుకునేందుకు కాబోలు అని అనుకోవడానికి వీల్లేకుండా దాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టేశారు. దీన్ని చూసిన నెటిజన్లు ఊరుకుంటారా? ఎక్కడికక్కడ ఏకి పారేసి ఇదేం పని అంటూ మండిపడుతున్నారు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు అని కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇలాగే వదిలేస్తే పోర్న్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తారేమో అని ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియా కంటెంట్‌పై నియంత్రణ అవసరమని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు.