తలపై పగిలిన టెంకాయలు.. - MicTv.in - Telugu News
mictv telugu

తలపై పగిలిన టెంకాయలు..

March 17, 2019

భక్తుల తలపై కొబ్బరికాయలు కొట్టే దృశ్యం చూడాలంటే శివకురబూరులో కురబ దేవర మహాత్సవానికి వెళ్ళాల్సిందే. అత్యంత వైభవంగా జరిగే ఈ మహోత్సవం ఆంధ్రా – కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో జరుగుతుంది. మూడు రాష్ట్రాల నుంచి 155 గ్రామాలకు చెందిన 600 కుటుంబాలు ఈ దేవరలో పాల్గొన్నాయి. భక్తులు తండోపతండాలుగా దేవరకు వస్తున్నారు. శాంతిపురం మండలం శివకురబూరులో నాలుగు రోజులుగా దేవర నిర్వహిస్తున్నారు. స్థానిక వీరభద్రేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఆలయ ప్రాంగణంలో కురబ కులస్తులు వారి సంప్రదాయ నృత్యాలతో అలరించారు. శనివారం మధ్యాహ్నం అమ్మవారిని ప్రత్యేక పల్లకిపై కొలువుదీర్చి దేవర ఎద్దును అలంకరించి మంగళ వాయిద్యాలు, పండరి భజనల నడుమ జాతర జరిగే ప్రాంతం వరకు తీసుకువెళ్ళారు. అక్కడ స్వాములు భక్తుల తలలపై కొబ్బరికాయలు కొట్టారు. ఈ వేడుకలను తిలకించేందుకు భారీగా జనం తరలి రావడంతో శివకురబూరు జనసంద్రంగా మారింది.