ఒమిక్రాన్ వైరస్ ప్రతి ఇంటికి చేరుతుంది- బిల్ గేట్స్ - MicTv.in - Telugu News
mictv telugu

ఒమిక్రాన్ వైరస్ ప్రతి ఇంటికి చేరుతుంది- బిల్ గేట్స్

December 22, 2021

05

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ ప్రభావం రోజు రోజుకు ఎంతంగా వ్యాపిస్తుందో అందరికి తెలిసిందే. ఈ మహమ్మారి సోకితే లక్షణాలు ఎలా ఉంటాయన్న విషయాలపై నిపుణులు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఈ వైరస్ కట్టడికి పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. మరికొన్ని దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. అయితే, ఈ వైరస్ ప్రభావం గురించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచనలం రేపుతున్నాయి. ‘ఒమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది.

ఇది ప్రతి ఇంటికి చేరుతుందని’ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణగా తన సన్నిహితులు చాలా మంది వైరస్ బారిన పడుతున్నారని తెలిపారు. ఈ మహమ్మారి వల్ల మనమంతా చెత్త దశను చూస్తున్నామన్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో తన హాలిడే ప్లాన్లను రద్దు చేసుకున్నానని చెప్పారు. అన్ని వైరస్‌ల కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని, దాని గురించి పూర్తిగా తెలిసేంత వరకు ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.