విదేశీయుడి వీరంగం.. పోలీసులను కత్తితో బెదిరించి… - MicTv.in - Telugu News
mictv telugu

విదేశీయుడి వీరంగం.. పోలీసులను కత్తితో బెదిరించి…

October 12, 2018

నన్ను అరెస్ట్ చేస్తారా ? మీకెంత ధైర్యం ? నన్ను తాకితే ఈ కత్తితో పొడిచి చంపేస్తా… అంటూ ఓ అమెరికా యువకుడు పోలీసులకు చుక్కలు చూపించాడు. విదేశీ యువకుడు అవడంతో పోలీసులు కాస్త సంయమనం పాటించారు. అదే అదునుగా భావించిన అతను పోలీసులను బండబూతులు తిడుతూ రెచ్చిపోయాడు. అంతటితో ఆగకుండా వంటింట్లోంచి కత్తి తెచ్చి బెదిరింపులకు దిగాడు.

ఉత్తర ప్రదేశ్ మథురలో జరిగింది ఈ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. అత్యాచారం, హత్య ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు అతడు. అమెరికాకు చెందిన అతని పేరు మైకేల్ జేమ్స్ బోయర్.The Other country man who threatened policemen with a knifeఅతనిపై ఫిర్యాదు చేసిన మహిళపైన కూడా బండబూతులు వర్షం కురిపించాడు. అతను ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళతో గతేడాది ఆగస్ట్ నుంచి సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి వుంటున్నారు. అమెరికాకు తీసుకువెళ్తానని గత కొంతకాలంగా అంటున్నాడని మహిళ తెలిపింది. తనను గర్భవతిని చేసి, హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది. రెండు నెలలకు ఒకసారి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట దాటవేస్తున్నాడని చెప్పింది. కేవలం తనను శారీరకంగా వాడుకోవడానికే అతను నాతో లివింగ్ రిలేషన్‌లో వున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. చాలా సేపటివరకు పోలీసులను హైరానా పట్టాడు. కొంతసేపటి తర్వాత అతణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళారు.