కవితను అధ్యక్ష పదవి నుంచి తొలగించిన పార్టీ - MicTv.in - Telugu News
mictv telugu

కవితను అధ్యక్ష పదవి నుంచి తొలగించిన పార్టీ

April 19, 2022

06

హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న కవితను ఆ పదవి నుంచి తొలగిస్తూ మహిళా కాంగ్రెస్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పార్టీ ఆఫీసు గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావుతో కవిత వాగ్వాదానికి దిగారు. వీరిద్దరి మధ్య ఘర్షణతో పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కవితపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలను తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ప్రకటన జారీ చేసింది.