The passenger who pointed out the thief..the video has gone viral
mictv telugu

సెల్‌ఫోన్ దొంగకు, ప్రయాణికుడు చుక్కలు..వీడియో వైరల్

September 16, 2022

ప్రయాణిస్తున్న రైలులో చోరీకి యత్నించిన ఓ దొంగకు ప్రయాణికుడు చుక్కలు చూపించాడు. దొండ రెండు చేతులను లోపలికి లాగిపట్టి, ఏకంగా 15 కిలోమీటర్ల వరకు కిందపడకుండా లాక్కెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోను వీక్షిస్తున్న నెటిజన్స్..’దొంగకు భలేగా బుద్ది చెప్పావ్’ అంటూ కామెంట్స్ చేస్తుంటే, మరికొంతమంది ‘దొంగకు చెమటలు పట్టించావ్, ఇక జన్మలో దొంగతనం చేయడు’ అంటూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

 

వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటర బిహార్‌లో జరిగింది. చోటుచేసుకుంది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెల్తోన్న ఓ రైలు..సాహెప్పూర్ కమాల్ స్టేషన్లో ఆగినప్పుడు ఓ వ్యక్తి కిటికీలోంచి, ఓ ప్రయాణికుడి సెల్‌ఫోన్‌ను దొంగిలించే ప్రయత్నం చేశాడు. కానీ, అప్రమత్తంగా ఉన్న ఆ ప్రయాణికుడు వెంటనే అతని చేయిని గట్టిగా పట్టుకున్నాడు. ఒకవైపు రైలు కదులుతుండటం, మరోవైపు చేయిని విడిచి పెట్టకపోవడంతో అతను వదిలేయాలంటూ వేడుకున్నాడు.

అంతలోనే రైలు ప్లాట్ఫాం దాటింది. దీంతో అతను బయటే వేలాడాడు. దొంగ పట్టు కోసం మరో చేయిని లోపలికి చాచాడు. అంతే లోపలున్న ప్రయాణికులు.. అతని రెండు చేతులను పట్టుకుని, కింద పడిపోకుండా చూశారు. దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్లపాటు అతను కదులుతున్న రైలులో బయటే గాల్లోనే వేలాడేలా చేశారు. చివరకు రైలు ఖగారియా సమీపించినప్పుడు ఆ దొంగను విడిచి పెట్టారు.