వరంగల్ ఎంజీఎంలో దారుణం.. రోగిని కొరికేసిన ఎలుకలు - MicTv.in - Telugu News
mictv telugu

వరంగల్ ఎంజీఎంలో దారుణం.. రోగిని కొరికేసిన ఎలుకలు

March 31, 2022

BBBBBB

వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఐసీయూలో ఉన్న ఓ రోగి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికేశాయి. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. వివరాలు.. హన్మకొండకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నాడు. దీంతో ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకోగా.. వ్యాధి తగ్గకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఎంజీఎంలో చేరాడు. పరిశీలించిన వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఐసీయూలో చేరిన తొలిరోజే రోగిని ఎలుకలు కొరికేశాయి. విషయాన్ని వెంటనే డాక్టర్లకు చెప్పడంతో కట్టుకట్టారు. గురువారం ఉదయం మరోమారు ఎలుకలు కొరికేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. వైద్యులు మళ్లీ కట్టుకట్టినా.. ఎలుకల భయంతో రోగి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేయగా.. త్వరలోనే ఎలుకల బెడదను తొలగిస్తామని హామీ ఇచ్చారు.