కోతి… క్వాలిటీ కంట్రోలర్ అవతారం ఎత్తింది ! - MicTv.in - Telugu News
mictv telugu

కోతి… క్వాలిటీ కంట్రోలర్ అవతారం ఎత్తింది !

October 25, 2018

సాధారణంగా కోతులు ఎప్పుడూ కోతిచేష్ఠలే చేస్తాయి. దీంతో మనుషులకు చెడ్డ చిరాకును తెచ్చి పెడుతుంటాయి. ఈమధ్య కోతులు అడవులను వీడి ఊళ్ళ మీద పడి జనాలను హైరానా పెడుతున్న విషయం తెలిసిందే. రోడ్ల మీద కూడా వాహనాలకు అడ్డంగా వెళ్ళి వాళ్ళనుంచి తినుబంఢారాలు ఇవ్వాలని మొండికేస్తున్నాయి. ఇంటి ఆవరణలో ఏం ఆరబెడదామన్నా వాటి నుంచి రక్షణ లేకుండా పోయింది. ఇదంతా ఒకెత్తు అయితే ఓ కోతిది మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు.

ఆ కోతి క్వాలిటీ కంట్రోలర్ అవతారం ఎత్తింది. పెట్రోల్ బంకుకు వెళ్ళిమరీ వాహనాల్లోని పెట్రోల్‌ను చెక్ చేసింది. అది క్వాలిటీదా, కల్తీదా అని మురక వాసన చూసి మరీ చెక్ చేసింది. కోతిగారి నిర్వాకం చూసి అక్కడున్న జనాలు ముక్కున వేలేసుకున్నారు. ఓవైపు పెట్రోల్ పోస్తుంటే చటుక్కున వాహనం మీదకు దూకి ట్యాంక్‌లోకి ముక్కు పెట్టి మురకవాసన చూసింది. కాసేపటి వరకు వాహనాల్లోని పెట్రోల్‌ను చెక్ చేసి అక్కడినుంచి నిష్క్రమించింది. ‘చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పోసే ఇంధనం క్వాలిటీగా పోస్తున్నారా ? లేకపోతే కొలతల్లో ఏమైనా మోసం చేస్తున్నారా ? అని చెక్ చేసినట్టుంది’ అని ఈ వీడియో చూసినవాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం వాట్సాప్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. క్రింది లింకులో మీరూ ఆ వీడియోను చూడొచ్చు.