గ్రహంతర వాసులు ఉన్నారని, లేరని ఇలా స్పష్టమైన ఆధారాలు లేకుండా రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇప్పటివరకు వారి ఉనికిపై స్పష్టత లేదు. ఇది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సాసర్ల వంటి వస్తువుల్లో వారు విహరిస్తారని వీడియోలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే అవన్నీ ఫేక్ అనే నిర్ధారణ అయింది. అయితే గుర్తు తెలియని వస్తువులు గాలిలో విహరిస్తున్న అంశానికి సంబంధించి అమెరికా రక్షణ సంస్థ ఇవాళ ఓ క్లారిటీ ఇచ్చింది. మూడు యూఎఫ్ఓ వీడియోలను పెంటగాన్ అధికారికంగా విడుదల చేసింది. రెండేళ్ల క్రితమే ఈ వీడియోలు ఆన్లైక్లో లీకయ్యాయి. ఆ వీడియోలను ద్రువీకరిస్తూ పెంటగాన్ మళ్లీ విడుదల చేయడంతో గ్రహాంతరవాసుల చర్చ మళ్లీ మొదలైంది. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ అబ్జెక్ట్లను యూఎఫ్‌వోలు అంటారు. 2004, 2015 సంవత్సరాల్లో అమెరికా నౌకదళ విమానాలు .. యూఎఫ్వోలను గుర్తించి ఫోటోలు తీశాయి. ఆ విమానాలు నడిపే పైలట్లుకు అవి కనిపించినట్లు పెంటగాన్ చెబుతున్నది. పైలట్లు కూడా అత్యంత వేగంగా, ఆకాశంలో విహరిస్తున్న ఆ వస్తువులను చూసి ఆశ్చర్యపోయామని తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరు పైలట్లు సంభాషిస్తున్న వీడియోను కూడా విడుదల చేశారు. మన విమానాల కన్నా వేగంగా కదులుతున్న ఆ ఆబ్జెక్ట్స్ గురించి వారు ఇంకా కొన్ని విషయాలు వెల్లడించారు.
ప్రస్తుతం ఆన్లైన్లో ఉన్న యూఎఫ్‌వో ఫూటేజ్ నిజమా కాదా అన్న సందేహాన్ని తీర్చేందుకు ఈ మూడు వీయోలను విడుదల చేసినట్లు రక్షణశాఖ స్పష్టంచేసింది. ఈ విషయమై పెంటగాన్ ప్రతినిధి సూ గౌఫ్ మాట్లాడుతూ.. ‘వీడియో విడుదల చేసినా.. వాటికి సంబంధించిన విషయాలను మాత్రం బయటపెట్టలేం. పైలట్లు ఇలాంటి యూఎఫ్వోలను చూస్తే, వాటి గురించి తెలియజేయాలి. ఈ వీడియోలు 2017 డిసెంబర్లోనే లీకయ్యాయి’ అని తెలిపారు. కాగా, యూఎఫ్వోలను అధ్యయనం చేసేందుకు పెంటగాన్ స్టడీ కూడా చేస్తోంది.
Pentagon declassifies three previously leaked top secret U.S. Navy videos of "unexplained aerial phenomena"—and that some believe could show UFOs. https://t.co/SgE0JDGtej pic.twitter.com/yhv8ZBDR0p
— ABC News (@ABC) April 27, 2020