మద్యం కోసం రోజూ విదేశానికి వెళ్తున్న భారతీయులు - MicTv.in - Telugu News
mictv telugu

మద్యం కోసం రోజూ విదేశానికి వెళ్తున్న భారతీయులు

May 20, 2022

నేరాలు అధికంగా జరుగుతాయని బాగా ప్రచారం పొందిన బీహార్ రాష్ట్రంలో వాటిని అరికట్టాలనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం 2016లో మద్య నిషేధం విధించింది. దాంతో అప్పటివరకు మత్తుకు అలవాటు పడ్డ ప్రాణాలు మందు కోసం ఏకంగా పక్క దేశానికి వెళుతున్నారు. బీహార్‌కు సరిహద్దల్లో నేపాల్ దేశం ఉంది. సుమారు 400 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటుండడంతో బిహారీలు రోజూ నేపాల్ వెళ్లి మద్యం సేవించి తిరిగి బీహార్‌కు వస్తున్నారు. నేపాల్‌లో రాత్రి 9 గంటల వరకు బార్లు, వైన్ షాపులు ఓపెన్‌గా ఉంటాయి. దాంతో ఆ దేశానికి క్యూ కడుతున్నారు. నేపాల్, భారత్‌ల మధ్య ఓపెన్ బోర్డర్ అగ్రిమెంట్ ఉంది. అక్కడి వారు మన దేశానికి, మనవాళ్లు నేపాల్‌కు ఎలాంటి పత్రాలు లేకుండా ప్రయాణించవచ్చు. దీంతో మందుబాబులు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. అంతేకాక, ఆ దేశ మద్యం అక్రమంగా బీహార్‌లోకి రవాణా అవుతోంది. ఎన్ని గట్టి చర్యలు తీసుకున్నా వీటిని అరికట్టలేకపోతున్నారు. దీని వల్ల ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతోంది. బీహారీలు మద్యంతో పాటు మన కంటే చౌకగా దొరికే వస్తువులను నేపాల్ నుంచి తెచ్చుకుంటారు. పెట్రోల్, డీజిల్ రేట్లు మన కంటే నేపాల్‌లో తక్కువ. అలాగే వంట సామాన్లు నేపాల్ కంటే మన వద్ద తక్కువ ధరకు దొరుకుతాయి. దాంతో నేపాలీ మహిళలు భారత్‌కు వచ్చి షాపింగ్ చేస్తుంటారు.