కొన్ని సంఘటనలు విన్నప్పుడు మనం ఇలా నిజంగా జరుగుతుందా? అని ఆశ్చర్యపోతుంటాం. అలాంటి ఘటన అమెరికాలో జరిగింది. ఒక వ్యక్తి నిజంగా పేను కొరికి చనిపోయాడు. వివరాలు.. అమెరికాలోని మైనోకు చెందిన ఒక వ్యక్తికి పేను కొరికింది. కరచిన తర్వాత అతడికి అరుదైన పొవాసాన్ వైరస్ సోకింది. అనంతరం అది పాకి బ్రెయిన్ ఇన్ఫెక్షన్గా మారింది. దీనికి చికిత్స చేయడానికి ఎలాంటి వ్యాక్సిన్ గానీ, నివారణ పద్ధతులు గానీ ఇంతవరకూ లేదు. ఈ విషయాన్ని అమెరికా వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పేనులే కదా అని అజాగ్రత్త వహించవద్దని పౌరులకు సూచిస్తున్నారు. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పేను కొరకడం మనకు సాధారణమే కానీ, కరోనా లాగా ఎప్పుడు, ఏ వ్యాధి ముంచుకొస్తుందో తెలియదు కాబట్టి, ముఖ్యంగా ఆడవాళ్లు తలలో పేను లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ఉత్తమం.