మందు కొడుతున్న ఫొటో నాదే.. రఘురామ - MicTv.in - Telugu News
mictv telugu

మందు కొడుతున్న ఫొటో నాదే.. రఘురామ

October 12, 2020

The photo of me drinking shampine .. Raghurama

‘అవును ఆ ఫొటో నాదే.. అయితే ఏంటి? క్రికెటర్లు తాగే షాంపైన్ తాగాను’ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తన ఫొటోపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఆ ఫొటో మూడేళ్ల క్రితం జరిగిన పార్టీలోనిది అని వివరణ ఇచ్చారు. తానెప్పుడూ ఈ ఫొటో చూడలేదని.. ఈ ఫొటో అందించిన పెద్దలు, బహుశా సుబ్బారెడ్డిగారు అనకుంటున్నానని తెలిపారు. ఆ ఫొటోలో తప్పేముంది అని ప్రశ్నించారు. కోల్‌కతా, హైదరాబాదా అన్నది  గుర్తులేదని స్పష్టంచేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ఎంపీ గారి కుమారుడు ఇచ్చిన ఫంక్షన్‌లోనిది ఆ ఫొటో అని పేర్కొన్నారు.  

సెలబ్రేషన్స్‌లో భాగంగా అందరి నోట్లో షాంపైన్ పోశారు.. తన నోట్లో కూడా పోశారని చెప్పారు. ‘అందరీ పార్టీల్లోలాగానే వైఎస్సార్‌సీపీవాళ్లు ఇచ్చిన పార్టీల్లో కూడా ఇదంతా కామనే. అలాంటి పార్టీల్లో రష్యన్ అమ్మాయిలు ఉంటారు. నేనేమీ అసభ్యంగా మాట్లాడలేదు. ఎవరి మీద చేతులు వేయలేదు. షాంపైన్ పోస్తే తాగిన పాపానికి ఆ ఫొటోను తీసుకుని ఉన్మాదుల్లా రెచ్చిపోయారు. మీరంతగా రెచ్చిపోవడానికి ఆ ఫొటోలో ఏముంది? మీరు సప్లై చేసే ప్రెసిడెంట్ మెడల్, నోబెల్ ప్రైజ్ వంటి చెత్త డ్రింకులు తాగకుండా షాంపైన్ నోట్లో పోసుకుంటే బాధగా ఉందా? అందరూ మీ ప్రెసిడెంట్ మెడల్ తాగి చచ్చిపోవాలా. ఆ ఫోటోను నేనే 500 మందికి పంపించాను. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవినాష్ రెడ్డి డీపీలు పెట్టుకుని ఇద్దరు తనకు అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టారు. వారి చివర రెడ్డి అనే పేరు ఉంది.. వారిని నేను గౌరవిస్తాను. అలాగని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను’ అని రఘురామ వెల్లడించారు. మరోవైపు తనకు అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టిన కొంతమంది నంబర్లు పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఆ ఫొటోతో తనపై అసభ్యకరంగా మాట్లాడిన వారిపై చర్యలు ఖాయమని.. త్వరలోనే వారు జైలుకు వెళతారని అన్నారు.