స్తంభాన్ని ఢీకొట్టిన విమానం.. 90 వేల ఇళ్లకు నిలిచిన విద్యుత్ - MicTv.in - Telugu News
mictv telugu

స్తంభాన్ని ఢీకొట్టిన విమానం.. 90 వేల ఇళ్లకు నిలిచిన విద్యుత్

November 28, 2022

ఓ చిన్న విమానం చేసిన పనికి 90 వేల ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సంఘటన ఎంతో డెవలప్ సాధించిన అమెరికాలో జరిగింది. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. స్థానిక పోలీసుల ప్రకారం.. మేరీల్యాండ్ లోని మాంట్ గో మేరీలో హైటెన్షన్ కరెంట్ స్తంభాన్ని చిన్న విమానం వచ్చి ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. విమానం ఢీకొనడంతో విద్యుత్ తీగలు తెగిపడి కిందపడిపోయాయి.

ఎవరికీ గాయాలు కాకపోయినా 90 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షాలు పడి ప్రతికూల వాతావరణం ఏర్పడినందున ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. విద్యుత్ తీగలు తెగిపడినందున అటువైపు ఎవరూ వెళ్లవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. విమానం చాలా తక్కువ ఎత్తులో రావడం వలన ప్రమాదం జరిగిందని, అయితే కచ్చితంగా నిర్ధారించలేమని స్థానిక అధికారులు అంటున్నారు.