స్వాతినాయుడిపై పోలీసుల వల.. - MicTv.in - Telugu News
mictv telugu

స్వాతినాయుడిపై పోలీసుల వల..

March 5, 2018

‘నా పర్మిషన్ లేకుండా నా అకౌంట్లోకి వంశీ అనే వ్యక్తి రూ. 50 వేలు ట్రాన్స్‌ఫర్ చేసి నాతో శృంగారం చేస్తానని వేధిస్తున్నాడు ’ అంటూ అడల్ట్స్ స్టార్ స్వాతి నాయుడు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదంతా పోలీసులు స్వాతి నాయుడుపై పన్నిన వల అని తెలుస్తోంది. గతంలో స్వాతినాయుడుపై వచ్చిన కొన్ని ఆరోపణలపై సాక్ష్యాలను సేకరించేందుకు పోలీసులు, తమ మనుషుల చేతనే రూ. 50 వేలను ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయించినట్టు విశ్వనీయ వర్గాల సమాచారం. స్వాతి నాయుడు విషయంలో కొన్ని నిజానిజాలను వెతికే క్రమంలోనే మేము ఆమె అకౌంట్‌కు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశామని పోలీసుల ద్వారా ఓ వార్తా సంస్థకు సమాచారం అందింది. దీనిపై ఎటువంటి అధికారిక సమాచారమూ తెలియరాలేదు.ఈ విషయమై తొలుత తను ఓ మీడియా ఛానల్‌కు వెళితే వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లమన్నారని తెలిపింది ఆ వీడియోలో. అక్కడినుండి వంశీ మీద కేసు పెట్టేందుకు పోలీసు స్టేషన్‌కు వెళితే, తమ పరిధిలోకి రాదని చెబుతూ తనను పలు స్టేషన్లకు తిప్పారని కూడా స్వాతి తన వీడియోలో ఆరోపించింది. ఆపదలో సాయం కోసం వెళితే పోలీసులు ఫిర్యాదు స్వీకరించకుండా తనను కుక్కలా తిప్పారని  చెప్పింది. తమ పరిధి కానప్పుడు ఫోన్‌‌లో మాట్లాడితే స్టేషన్‌‌కు ఎందుకు రమ్మన్నారని ఆమె నిలదీసింది. వంశీతో పాటు పోలీస్‌ శాఖకు చెందిన కొందరు వ్యక్తులు తనను వేధిస్తున్నారని, తనను చంపేసే అవకాశం ఉందని ఆమె తెలిపింది. 

అయితే వీడియోలో స్వాతి నాయుడు వంశీదని బహిరంగంగా చెప్పిన ఫోన్ నంబర్ ట్రూ కాలర్‌లో రాహుల్ అని చూపుతోందట. అతని వద్ద పనిచేసే మరో వ్యక్తి నంబర్ ను కూడా స్వాతినాయుడు బహిరంగంగా వెల్లడించింది.