చలాన్లపై డిస్కౌంట్ ఎఫెక్ట్.. ఒక్కరోజులో ఐదు కోట్లు వసూలు - MicTv.in - Telugu News
mictv telugu

చలాన్లపై డిస్కౌంట్ ఎఫెక్ట్.. ఒక్కరోజులో ఐదు కోట్లు వసూలు

March 2, 2022

04

తెలంగాణలో పెండింగ్ చలాన్ల చెల్లింపుల విషయంలో ప్రకటించిన డిస్కౌంట్ ప్రభావంతో తొలిరోజు వాహనదారులు భారీ ఎత్తున స్పందించారు. దాదాపు 5 లక్షల పెండింగ్ చలాన్ల చెల్లింపులు ఒక్కరోజులోనే జరిగాయి. దీంతో పోలీస్ శాఖకు ఐదు కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఇక, చలానా క్లియరెన్స్ కోసం మూడు లక్షల వరకు వాహనదారులు రావొచ్చని పోలీస్ డిపార్ట్మెంట్ భావించగా.. అంచనాలకు మించి ఐదు లక్షలకు పైగా చలాన్ల చెల్లింపులు జరిగిపోయాయి. మరోవైపు అధిక రద్దీతో వెబ్ సైట్ సర్వర్ డౌన్ అవడంతో చెల్లింపులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో మిగతా వాళ్ల చలాన్ల చెల్లింపులకు ఆటంకం ఏర్పడింది. ఇదిలా ఉండగా, ఈ నెలాఖరు వరకు గడువు ఉండడంతో మొత్తం పెండింగ్ చలాన్లన్నీ క్లియర్ అయిపోతాయని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.