యువకుల్లో పెరుగుతున్న నేరప్రవృత్తి కలవరపెడుతోంది. ప్రేమ వ్యవహరంలో నరరూపరాక్షషులుగా మారిపోతున్నారు. కలిసిమెలిసి తిరిగే స్నేహితులనే అంతమొందిస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్‌లో నవీన్ హత్య ఇంకా కళ్లముందు తిరుగుతుండగానే..ఏపీలోని కర్నూలు అదే తరహా ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. తన ప్రియురాలి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనే కారణంగా స్నేహితుడిని చంపేశాడు యువకుడు. హత్య కోసం మరో స్నేహితుడి సాయం తీసుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చివరికి భయంతో నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయారు.
కర్నూలు నగరంలో ఇటీవల మురళీకృష్ణ అనే యువకుడి హత్య సంచలనం సృష్టించింది. మురళీకృష్ణ కనబడకుండా పోయినా సుమారు 20 రోజులు తర్వాత అతడు హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. అనంతరం మరో 15 రోజులు తర్వాత కేసును చేధించారు. నిందితులు దినేష్, కిరణ్‌కుమార్ అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మురళీకృష్ణ , దినేష్ చిన్ననాటి స్నేహితులు. పదోతరగతి వరకు చదువుకున్నారు. ప్రస్తుతం మురళీకృష్ణ డెకరేషన్ పనులు చేస్తుండగా..దినేష్ డిగ్రీ చదువున్నాడు. ఈ క్రమంలో దినేష్ ఓ అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఫోన్లో ఉంచుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న మురళీకృష్ణ ఆ వీడియాలను తన ఫోన్‌లోకి షేర్ చేసుకున్నాడు. వాటిని అమ్మాయికి పంపించి బ్లాక్‌మెయిల్‌కి దిగాడు. దాంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
తర్వాత దినేష్-మురళీ మధ్య గొడవలు మొదలయ్యాయి. మురళీకృష్ణపై పగ పెంచుకున్నాడు. అతణ్ని చంపాలని నిర్ణయించుకున్నాడు.
హత్యకు స్కెచ్ వేసి ఆన్ లైన్ ద్వారా కత్తిని కొనుగోలు చేశాడు. అదే కాలనీకి చెందిన తన స్నేహితుడు డిగ్రీ చదివే కిరణ్ కుమార్ ను జత చేసుకుని ఈ ఏడాది జనవరి 25న బాలాజీనగర్ లో మురళీకృష్ణ పనిచేస్తుండగా వారిద్దరూ వెళ్లి అతణ్ని కలిశారు.అనంతరం పంచలింగాల వద్ద ఉన్న స్కంధ వెంచర్ కి తీసుకెళ్లారు. అక్కడ ఎవరు లేని సమయం చూసుకుని మురళీకృష్ణ గుండెలో కత్తితో పొడిచారు. తర్వాత అక్కడే కాలువలో అతణ్ని ముంచేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం నన్నూరు టోల్ ప్లాజా సమీపంలో హంద్రీనీవా కాలువలో పడేశారు.ఏం తెలియనట్టు ఇంటికి వచ్చి తమ పనులు చూసుకున్నారు
ఫిబ్రవరి 16న అతని తల్లి రాధమ్మ ఫిర్యాదు మేరకు కర్నూలు తాలుకా అర్బన్ ఎస్సై సమీర్ అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దినేష్, కిరణ్‌కుమార్‌లు రెవెన్యూ కార్యాలయంలో లొంగిపోయి నేరం అంగీకరించారు.