The police have released the video of Chinthamaneni Prabhakar at cock fight
mictv telugu

చింతమనేనికి దిమ్మతిరిగే షాక్.. పరారవుతున్న వీడియో

July 7, 2022

The police have released the video of Chinthamaneni Prabhakar at  cock fight

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చినకంజర్ల శివారులో కోడి పందేలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ పందేల్లో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారని…తాము రైడ్ చేసిన సమయంలో పారిపోయారని పోలీసులు తెలిపారు. అయితే తాను అక్కడ లేనని.. రాక్షస రాజకీయం అవసరమా? అని చింతమనేని ప్రభాకర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

కోడి పందాల్లో లేని వ్యక్తి నీ ఉన్నట్లు గానే చూపటం మీ జెండా అజెండా అని ప్రశ్నించారు. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొండి, ఈ దుర్మార్గపు నీచమైన ప్రచారం ఇకనైన ఆపండి అంటూ ఆయన ఫేస్ బుక్ లైవ్ లో కోరారు. ఈ నీచమైన ప్రచారం తోనే కుప్ప కూలే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారు, తెలుగు ప్రజల్లో విష బీజాలు నాటి నాడు అధికారంలోకి వచ్చారు ఆ మేడ కూలిపోయే సమయం ఆసన్నమయిందైన్నారు.

ఈ వీడియో తర్వాత.. కోడిపందేల్లో చింతమనేని ప్రభాకర్ ఉన్న వీడియోను పోలీసులు విడుదల చేశారు. కోడి పందేల శిబిరం నుంచి వెళ్లిపోతున్న చింతమనేని దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పోలీసులు.. కోడి పందాల కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. కోడిపందాల బెట్టింగ్‌ కేసులో చింతమనేనిని ఏ1గా నిర్ధారించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 21 మంది బెట్టింగ్‌ రాయుళ్లను రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.