Home > Featured > విద్యార్ధులకు అలర్ట్.. వాయిదా పడ్డ జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు

విద్యార్ధులకు అలర్ట్.. వాయిదా పడ్డ జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు

జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలపై జాతీయ పరీక్షల మండలి కీలక వార్త తెలియజేసింది. ఈ పరీక్షలను ముందుగా అనుకున్న షెడ్యూల్‌లో మార్పులు చేసింది. పాత షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు జులై 21 నుంచి ప్రారంభమై జులై 30 వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే మారిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జులై 25 నుంచి మొదలవుతాయి. ఈ పరీక్షలకు సంబంధించి జులై 21 నుంచి అంటే గురువారం నుంచి ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అయితే పరీక్షల తేదీ మార్పు వెనుక గల కారణాన్ని మాత్రం తెలియజేయలేదు. కాగా, మొదటి విడుత పరీక్షలు జూన్ 23 నుంచి జూన్ 29 వరకు నిర్వహించగా, ఫలితాలను మాత్రం జులై 11న విడుదల చేసిన విషయం తెలిసిందే.

Updated : 20 July 2022 8:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top