The President of Sri Lanka who fled the country.. his wife and two others
mictv telugu

దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు..భార్య, మరో ఇద్దరు

July 13, 2022

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష, ఆయన భార్య, మరో ఇద్దరు అంగరక్షకులతో కలిసి దేశం విడిచి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పారిపోయారని, ఓ వైమానిక దళ అధికారి తెలిపారు. శ్రీలంకలో గతకొన్ని రోజులుగా ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు అధ్యక్షుడిపై తీవ్రంగా మండిపడుతూ, అధ్యక్ష భవనంలోకి ప్రవేశించి, కొన్ని వాహనాలకు నిప్పు అంటించిన విషయం తెలిసిందే. దాంతో ఆయన అధ్యక్ష పదవి నుంచి నేడు వైదొలగుతానని పార్లమెంటు స్పీకర్, ప్రధాని విక్రమసింఘేకు ఆయన ఇది వరకే తెలిపారు.

ఈ క్రమంలో గతకొన్ని రోజులుగా దేశం విడిచి పారిపోయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవ్వడంతో నేడు ఈ రోజు తెల్లవారుజామున ఆయన భార్య సహా ఇద్దరు అంగరక్షకులతో కలిసి వాయు సేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పరారైయ్యారు. స్పీకర్ మహింద అభయ్ వర్ధనకు ఆయన రాజీనామా లేఖను కూడా అందించినట్లు సమాచారం. అయితే, గొటబాయ కొత్త షరతు నేపథ్యంలో ఆయన రాజీనామా విషయమై, స్పీకర్ ప్రకటన చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. శ్రీలంకలో ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షాల సన్నాహాలు.. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఏ క్షణంలోనైనా రాజీనామా చేసే అవకాశం ఉన్నందున శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు విపక్ష పార్టీలైన ఎస్‌జేబీ, ఎఎఎపీ నేతలు సంప్రదింపులు ముమ్మరం చేశారు.

ఇక, తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎస్‌జేబీ నేత సాజిత్ ప్రేమదాస ఇప్పటికే అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. ఆయనకు మద్దతును కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం దేశ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి రాజీనామాలు చేసిన పరిస్థితుల్లో ఆపద్ధర్మ అధ్యక్షుడిగా పార్లమెంటు స్పీకర్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. 30 రోజుల్లోగా పార్లమెంటు సభ్యులు తమలో ఒకరిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి.