The president of Ukraine.. missed a big risk
mictv telugu

ఉక్రెయిన్ అధ్యక్షుడికి..తప్పిన పెను ప్రమాదం

September 15, 2022

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య గతకొన్ని నెలల క్రితం యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్లు ప్రపంచమంతటా మార్‌మ్రోగాయి. అయితే, తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో ప్యాసింజర్‌ వాహనం ఢీకొట్టడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు.

”ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జెలెన్‌స్కీ ప్రయాణిస్తున్న కారును మరో ప్యాసింజర్‌ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జెలెన్‌స్కీ తీవ్రమైన గాయాలేమీ కాలేదు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారు. అధ్యక్షుడితోపాటు వైద్యసిబ్బంది ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌కు వైద్య సహాయం అందజేశాం. ఆ తర్వాత అతడిని అంబులెన్సులో దవాఖానకు తరలించాం” అని జెలెన్‌స్కీ ప్రతినిధి సెర్హిల్‌ జికిఫొరోవ్‌ ఫేస్‌బుక్‌ ప్రకటనలో వెల్లడించారు.

అనంతరం జెలెన్‌స్కీని వైదులు పరిశీలించి, ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని చెప్పాడంతో ఉక్రెయిన్ ప్రజలు ఊపీరిపిల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి న్యాయాధికారులు విచారణ జరుపుతున్నారు. హత్యాయత్నమా లేదా ప్రమాద వషాత్తు జరిగిందా అనే విషయం విచారణలో తేలుతుందని అధికారులు పేర్కొన్నారు.