The President's Office responded to the incident of Hindupur YCP MP Gorantla Madhav.
mictv telugu

గోరంట్ల మాధవ్‌ ఘటనపై స్పందించిన రాష్ట్రపతి.. చర్యలు తీసుకోవాలని ఆదేశం

August 30, 2022

ఏపీలోని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్ వీడియో కాలింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసిశారు. మహిళా జేఏసీ నేతల ఫిర్యాదు పట్ల తాజాగా రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. మహిళా నేతలు అందజేసిన ఫిర్యాదును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపింది. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన డిగ్నిటీ ఫర్‌ ఉమెన్‌ జేఏసీ నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్‌తో పాటు జాతీయ మహిళా కమిషన్‌, పలువురు కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేశారు.

అయితే, రాష్ట్రపతికి ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం తాజాగా స్పందించింది. ఈ నెల 23న మహిళా జేఏసీ నేతలంతా రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారని.. ఆ కాపీని సీఎస్‌కు పంపి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిపింది. ఈ మేరకు మహిళా జేఏసీ కన్వీనర్‌ చెన్నుపాటి కీర్తికి సమాచారం ఇస్తూ లేఖ పంపింది.