కొండెక్కిన కోడి ధర.. కేజీ ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

కొండెక్కిన కోడి ధర.. కేజీ ఎంతంటే?

February 28, 2022

chiken

రెండు సంవత్సరాలపాటు కల్లోలం సృష్టించిన కరోనా మహమ్మారి కారణంగా దేశ ప్రజలు ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురై, తీవ్రమైన అవస్థలు పడిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం లాక్‌డౌన్, టీకాల ద్వారా కట్టడిచేయడంతో గతకొన్ని నెలలుగా కరోనా తగ్గుముఖం పట్టింది. దీంతో ఇప్పుడిప్పుడే ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఇటువంటి సమయంలో గత ఐదు రోజులుగా రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మార్కెట్లో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజీల్, గ్యాస్, నూనె ధరలతోపాటు కోడి ధరలు కూడా సామాన్యుడు కొనలేని విధంగా కొండెక్కాయి.

చికెన్, గుడ్లు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెప్పడంతో చికెన్ కొనుక్కోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఎండకాలం ప్రారంభం నుంచే ధరలు తగ్గుతుంటాయి. కానీ, అందుకు విరుద్ధంగా వారం రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. 2022, ఫిబ్రవరి 21వ తేదీన రూ. 222 ధర ఉంటే, ఫిబ్రవరి 27వ తేదీ అమాంతం రూ. 270కి ఎగబాకింది. దీంతో కిలో కొనుక్కొనే వారు అరకిలోకు పరిమితమవుతున్నారు. వారం రోజుల వ్యవధిలో రూ. 50 వరకు పెరగడం గమనార్హం.

మార్కెట్లో ప్రస్తుతం కేజీ చికెన్ ధర..

21వ తేదీ రూ. 222
22వ తేదీ రూ. 228
23వ తేదీ రూ. 236
24వ తేదీ రూ. 244
25వ తేదీ రూ. 250
26వ తేదీ రూ. 260
27వ తేదీ రూ. 270లకు చేరింది.