పసిడి ప్రియులకు నిజంగా ఇది శుభవార్తే. దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పది గ్రాముల బంగారంపై భారీగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో బంగారం ధరల్లో చాలా తేడా వచ్చింది. గతవారం రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు..అక్కడి నుంచి నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధర భారీగా తగ్గింది. భారత్ బంగారం ధరలను గమనించినట్లయితే…ఫిబ్రవరి 17నాటికి దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల బంగారం ధర రూ. 56,730గా నమోదు అయ్యింది. 22క్యారెట్ల బంగారం ధర రూ. 51,730గా నమోదు అయ్యింది.
హైదరాబాద్ లో బంగారం ధర రూ. 24క్యారెట్లు రూ. 56, 800గా ఉంది. 22క్యారెట్లు రూ. 51,800గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 56,880 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 52,150గా నమోదు అయ్యింది. రికార్డు స్థాయి నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 10 గ్రాముల బంగారం ధర 58,500నుంచి తగ్గుతూ వస్తూ..దాదాపు 2వేల వరకు తగ్గింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారు ఆభరణాలు కోనుగోలు చేయాలని ప్లాన్ చేసుకునేవారికి ఇది మంచి అవకాశం.