ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధ ప్రకటనతో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది. గురువారం భారత్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 51 వేల మార్కును తాకింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్లో పసిడి విలువ 2.02 శాతం పెరిగి, రూ. 51,396కి చేరింది. వెండి ధరలో రెండు శాతం పెరుగుదల నమోదైంది. దాంతో కిలోకు దాని విలువ రూ. 65,876కు పెరిగింది.