The prices of fruits and vegetables have increased by 40 percent
mictv telugu

భగ్గుమంటున్న కూరగాయల, పండ్ల ధరలు..ఏకంగా 40 శాతం పెంపు

August 3, 2022

దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కూరగాయల ధరలు, పండ్ల ధరలు, ఫలాల ధరలు మండిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం..శ్రావణ మాసం ప్రారంభం కావడమే. ఈ మాసం వచ్చిన ప్రతిసారి మార్కెట్‌లో కూరగాయల ధరలు, పండ్లు, ఫలాల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఈసారి కూడా కూరగాయల ధరలు 40 శాతం, ఫలాల ధరలు 20 శాతం మేర పెరిగిపోయాయి. శ్రావణ మాసంలో అధికశాతం కుటుంబాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసలుంటారు. మాంసాహారానికి, మద్యానికి దూరంగా ఉంటారు. అంతేకాదు, శ్రావణ మాసంలో కోడి, మేక మాంసాలకు డిమాండ్‌ భారీగా పడిపోతుంది. సాధారణంగా ఉపవాసాలుండే ఈ కుటుంబాల్లో పురుషులు మద్యం కూడా ముట్టుకోరు.

ప్రతి ఏటా వచ్చే శ్రావణ మాసంలో కోడి మాంసం, మేక మాంసం ధరలు తగ్గిన, కూరగాయలు, పండ్లు, ఫలాల ధరలు మాత్రం అమాంతంగా పెరుగిపోతాయి. శ్రావణ మాసం ప్రారంభానికి ముందు ఏపీఎంసీలోకి 2,586 టన్నుల కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు 3,815 టన్నులు వస్తున్నాయి. అంటే శ్రావణ మాసంలో కూరగాయాలకు ఏ స్ధాయిలో డిమాండ్‌ ఉంటుందో ఇక్కడే తెలిసిపోతుంది.

మరోపక్క ఏపీఎంసీలోకి కూరగాయల లోడుతో వచ్చే ట్రక్కులు, టెంపోల సంఖ్య తగ్గిపోయింది. దీంతో డిమాండ్‌ ఎక్కువ, సరుకుల రవాణా తక్కువ అనే పరిస్ధితి నెలకొంది. ఫలితంగా కూరగాయల ధరలు హోల్‌సేల్‌ మార్కెట్‌లో 10–20 శాతం పెరగ్గా, రిటైల్‌ వ్యాపారులు 40 శాతం మేర పెంచారు. అలాగే పండ్లు, ఫలాల ధరలు హోల్‌సేల్‌ మార్కెట్‌లో 10–15 శాతం పెరగ్గా రిటైల్‌లో 20 శాతం మేర ధరలు పెంచాల్సి వచ్చిందని చిరు వ్యాపారులు అంటున్నారు.