హనుమంతుడి గుడి పూజారి.. మహిళలు తాకితే మూర్ఛపోతాడట! - MicTv.in - Telugu News
mictv telugu

హనుమంతుడి గుడి పూజారి.. మహిళలు తాకితే మూర్ఛపోతాడట!

June 23, 2022

 


హనుమంతుడి గుడిలోని ఆ పూజారిని… ఎవరైనా మహిళలు కానీ, బాలికలు కానీ తాకితే వెంటనే స్పృహా కోల్పోతాడట. బ్రహ్మచారి దీక్షలో ఉన్న అతన్ని ఏ ఆడ మనిషి తాకినా కళ్లు తిరిగి పడిపోతాడట. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ వింత సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆలయానికి వచ్చిన మహిళలు తనను పొరపాటున ముట్టుకున్నా సహించలేడని తెలిసి, విసుగు చెందిన కొందరు భక్తులు.. స్థానికంగా ఉన్న సైకియాట్రిస్ట్ దగ్గరకు అతడ్ని తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరిశీలించాక అక్కడ అసలు విషయం బయటపడింది.

అక్కడ ఆ పూజారికి పలు టెస్టులు చేసి రిపోర్టులను పరిశీలించగా అతడు బాగానే ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ తర్వాత కాస్త ఆలోచించిన డాక్టర్.. పూజారికి చిన్న పరీక్ష పెట్టారు. ‘మహిళా నర్సు నిన్ను తాకుతుంది. నువ్వు స్పృహా కోల్పోతావో? లేదో? చూద్దాం’ అని డాక్టర్.. పూజారితో చెప్పాడు. కానీ మహిళా నర్సుతో కాకుండా, ఆఫీస్ బాయ్ తో తాకించాడు డాక్టర్. అది తెలియని ఆ పూజారి మాత్రం కళ్లు తిరిగి పడిపోయాడు. పూజారి స్పృహలోకి వచ్చాక ఆ డాక్టర్ జరిగినదంతా చెప్పాడు.

ఇదొక రకమైన మానసిక వ్యాధి అని చెప్పారు. కొందరు తనను తాను అమితాబ్ బచ్చన్ లా ఫీలయి అదే ఊహించుకుంటూ నటిస్తారు. కొందరు మంచి డ్యాన్సర్ అనుకుంటూ డ్యాన్స్ చేస్తారు. అదే విధంగా, ఈ పూజారి కూడా తనలో భగవంతుడి శక్తి ఉందని భావిస్తున్నాడని, అందుకే ఇలా చేస్తున్నాడని చెప్పారు . ప్రస్తుతం పూజారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు డాక్టర్లు.