కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆరే.. పోసాని - MicTv.in - Telugu News
mictv telugu

కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆరే.. పోసాని

January 17, 2020

Jr NTR.

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఏం చెయ్యాలో చెప్పారు. కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ‘ప్రజల్లో నమ్మకం ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. లేకపోతే చంద్రబాబు లాగా మోసం చేసే తెలివితేటలైనా ఉండాలి. సీనియర్ ఎన్టీఆర్ తన విల్ పవర్‌తో ముఖ్యమంత్రి కాగలిగారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సైతం నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ ఉంటే కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ప్రజలకు నమ్మకం ఉంటే ఎలాంటివారైనా సీఎం అయ్యే అవకాశం ఉంది’ అని పోసాని వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.. దీనిపై మీ స్పందన ఏంటి అని అడగగా.. పోసాని తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ ఆ అన్న ఎన్టీఆర్ వచ్చినా.. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా, ఇక్కడ రాజకీయ శూన్యత ఉండాలి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ పాలన బాగాలేదని, ప్రజాసేవ చేయడంలేదనే పరిస్థితి ఉంటే కచ్చితంగా వేరే పార్టీకి అవకాశం ఉంటుంది. జగన్ అలాంటి అవకాశం ఇస్తారని నేను అనుకోవడంలేదు’ అని పోసాని అన్నారు.