The protesting girls sat on the boys' laps in kerala
mictv telugu

అబ్బాయిల ఒడిలో కూర్చుని నిరసన తెలిపిన అమ్మాయిలు.. ఎందుకంటే

July 22, 2022

కేరళలోని తిరువనంతపురంలో కాలేజీ విద్యార్ధినీ విద్యార్ధులు వినూత్నంగా నిరసన తెలిపారు. బస్టాపులో ముగ్గురు కూర్చునేలా ఉన్న బెంచీని కొందరు కట్ చేసి మూడు వేర్వేరు కుర్చీలుగా మార్చారు. దీంతో కాలేజీ స్టూడెంట్స్ వినూత్నంగా ఆలోచించి తమ నిరసనపై అందరి దృష్టి పడేలా చేయాలనుకున్నారు. అనుకుందే తడవుగా అమలు చేసేశారు. మూడు కుర్చీలలో మొదట అబ్బాయిలు కూర్చోగా, వారి ఒడిలో అమ్మాయిలు కూర్చున్నారు. అనంతరం వాటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పక్కపక్కనే అబ్బాయిలు, అమ్మాయిలు కూర్చోకూడదతే ఉద్దేశంతో ఇలా చేశారని, ఈ మోరల్ పోలీసింగ్‌కి వ్యతిరేకంగా ఈ విధంగా నిరసన తెలిపామని విద్యార్ధులు తెలిపారు.