The Railway Department has increased the wages of the field staff
mictv telugu

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి జీతాలు పెంచుతున్న రైల్వే శాఖ

November 17, 2022

ఉద్యోగులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. సూపర్ వైజరీ స్థాయి ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్టు వెల్లడించింది. ఈ ప్రతిపాదనకు ఆమోదం కూడా లభించినట్టు ప్రకటించింది. దీంతో 80 వేల మంది లబ్ది పొందుతారని, జీతాల పెంపు రూ. 2500 – 4000 వరకు ఉంటుందని రైల్వే బోర్డు చైర్మెన్ వీకే త్రిపాఠి తెలిపారు.

ఈ పెంపు వల్ల శాఖపై అదనపు భారం పడదని, ఈ డబ్బును వివిధ మార్గాల ద్వారా ఖర్చులను తగ్గించుకొని పొదుపు చేసినట్టు వివరించారు. ఈ పెంపుతో వేల మంది సిబ్బంది గ్రూప్ ఏ అధికారులతో సమాన వేతనం పొందుతారని, 80 వేల మంది సూపర్వైజరీ ఉద్యోగులు హై పే గ్రేడ్‌‌కు అర్హులు అవుతారని చెప్పారు. జీతాల పెంపు వల్ల కేవలం సూపర్ వైజర్లకే కాకుండా 40 వేల మంది ఫీల్డ్ లెవెల్ వర్కర్లయిన స్టేషన్ మాస్టర్లు, టికెట్ చెకర్స్, ట్రాఫిక్ ఇన్స్‌‌‌పెక్టర్లకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కాగా, 16 ఏళ్లుగా పెండింగులో ఉన్న సూపర్ వైజరీ క్యాడర్ అప్‌గ్రెడేషన్ డిమాండ్ దీంతో నెరవేరిందని త్రిపాఠీ తెలిపారు.The Railway Department has increased the wages of the field staff