రియల్ హీరో.. 80 మంది ప్రాణాలు కాపాడాడు.. లేదంటే మరో కొండగట్టు అయ్యేది - MicTv.in - Telugu News
mictv telugu

రియల్ హీరో.. 80 మంది ప్రాణాలు కాపాడాడు.. లేదంటే మరో కొండగట్టు అయ్యేది

September 25, 2018

ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు ఆపన్నహస్తం అందించి రియల్ హీరోలుగా నిలుస్తారు. ఈ హీరోలు సినిమా హీరోలలా బిల్డప్‌లు కొట్టరు. సామాన్యుల్లోనే దాగివుంటారు. పరిస్థితులు డిమాండ్ చేసినప్పుడు ముందుకు వచ్చి అండగా నిలుస్తారు. అలాంటి ఓ హీరో కథే ఇది. ఈ ఘటన కొండగట్టు బస్సు ప్రమాదాన్ని తలపిస్తుంది. ఈ ప్రమాదం కేరళలో జరిగింది. ఈ ప్రమాదం సంభవించడానికి ముందు అక్కడికి ఓ సమాన్య హీరో వచ్చాడు. బస్సును ప్రమాదానికి గురికాకుండా ఆపి 80 మంది ప్రాణాలు కాపాడాడు. ఎలా కాపాడాడో తెలుసుకుందాం…The real hero .. 80 lives have been saved ... otherwise it would be another Kondagattuతమిళనాడు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన ఓ బస్సు కేరళలోని రాజక్కాడ్‌కు వెళుతోంది. ఎరచ్చిపార వద్ద ఆ బస్సు అదుపుతప్పింది. రోడ్డు కిందకి దూసుకెళ్లిపోతోంది. ఊహించని పరిణామానికి బస్సులో వున్న ప్రయాణికులంతా కేకలు పెట్టసాగారు. క్షణాల వ్యవధిలోనే బస్సు లోయలోకి పడబోయింది. అక్కడే వున్న కపిల్ వెంటనే ఆ బస్సును లోయలోకి పడకుండా ఆపాలనుకున్నాడు. యుద్ధప్రతిపాదికన తన జేసీబీని అక్కడికి తీసుకెళ్లాడు.

జేసీబీ హ్యాండ్‌‌తో బస్సును దాదాపు గంటపాటు నిలిపి ఉంచాడు. వెంటనే ప్రయాణికులను బస్సులోంచి దిగెయ్యాల్సిందిగా ఆదేశించాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న 80 మంది ప్రయాణికులు చకచకా బస్సు దిగి హమ్మయ్య గండం గడిచింది అని ఊపిరి పీల్చుకున్నారు.

తర్వాత కపిల్ ఎంతో శ్రమించి బస్సును కూడా బయటకు లాగేశాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కపిల్ స్నేహితుడు సోషల్ మీడియాలో పెట్టడంతో అతని హీరోయిజం ఈ ప్రపంచానికి తెలిసింది. కానీ కపిల్ తనకు పబ్లిసిటీని కోరుకోడు. చేసేది మంచి అయినా దాచి చెయ్యాలి అనుకునే రకం. ఎందుకు పోస్ట్ చేశావని ఫ్రెండ్‌ని అడిగాడు. మంచి గురించి నలుగురికి తెలిస్తేనే మంచిది కదా.. ఆ నలుగురిలో ఏ ఒక్కరు స్పందించినా చాలు కదా అన్నాడట.

కపిల్ చొరవతో ప్రాణాలు దక్కించున్నవారు ఆనంద భాష్పాలు రాలుస్తూ అతడికి థ్యాంక్స్ చెప్పిన విషయాన్ని తన వాల్‌పై రాసుకొచ్చాడు. కపిల్ ఆ సమయంలో అక్కడ లేకుండా వుండి, సహాయానికి పూనుకోకపోయి వుంటే అందరి ప్రాణాలు పోయేవని వాళ్లంతా కపిల్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. కపిల్ సహాయాన్ని చాలా మంది సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు.

അപ്പോൾ സമയം 4 മണിയോടെ അടുത്തിരുന്നു , എങ്കിലും പതിവിലും കടുപ്പം ഏറിയ ഉച്ചവെയിൽ മടങ്ങാൻ…

Posted by George Mathew on Friday, 21 September 2018