నేను బ్యాట్మింటన్‌కు దూరం కావడానికి కారణం అతనే… గుత్తాజ్వాలా - MicTv.in - Telugu News
mictv telugu

నేను బ్యాట్మింటన్‌కు దూరం కావడానికి కారణం అతనే… గుత్తాజ్వాలా

October 10, 2018

ప్రపంచవ్యాప్తంగా ‘మీటూ’ ఉద్యమం గొప్పగొప్పవాళ్ళ లుకలుకలను బయటకు తీసుకువస్తోంది. తము ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి ఒక్కక్కరుగా బయటకు వచ్చి ధైర్యంగా చెబుతున్నారు. దీంతో తెరమీద హుందాగల పాత్రలు పోషించి, శభాశ్ అనిపించుకున్న నటులు అసలు స్వరూపాలు బహిర్గతం అవుతున్నాయి.

అయితే ఈ వేధింపులు కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదని, మీడియా, క్రీడా రంగాల్లోనూ ఉందని చెబుతూ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తనకు ఎదురైన వేధింపులను బహిర్గతం చేసింది. తనను ఓ వ్యక్తి మానసికంగా చాలా వేధించాడని పేర్కొంటూ తన ట్విటర్‌లో కొన్ని ట్వీట్లు పెట్టింది.The reason I'm getting to badminton is that he …‘నాకు క్రీడారంగంలో ఎదురైన మానసిక వేధింపుల గురించి  వెల్లడించే సమయం ఆసన్నమైంది. అతను 2006లో చీఫ్‌గా వచ్చాడు. నేను జాతీయ చాంపియన్ షిప్ సాధించానని తెలిసికూడా నన్ను జట్టు నుంచి తొలగించాడు. మానసికంగా నన్ను చాలా వేధించాడు. రియో ఒలింపిక్స్ తరువాత కూడా అతని వేధింపులు ఆగలేవు. నేను బ్యాడ్మింటన్‌కు దూరం అవడానికి ఈ వేధింపులు కూడా కారణం. అందుకే నేను జట్టుకు పూర్తిగా దూరం కావాల్సివచ్చింది. నేను మిక్సెడ్ డబుల్స్‌లో ఎవరితో ఆడతానో అతణ్ణి బెదిరించేవాడు. నన్ను అన్నీ రకాలుగా ఒంటరిని చేశాడు’ అని పేర్కొంది. కాగా గుత్తాజ్వాలా తనను వేధించిన వ్యక్తి పేరు వెల్లడించలేదు.