the relationship between KGF director Prashanth Neel and Raghuveera Reddy
mictv telugu

KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి, రఘవీరారెడ్డికి మధ్య సంబంధం ఏంటి?

August 16, 2022

కేజీఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. మన తెలుగువాడేనన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా మడకశిరలోని నీలకంఠ పురం అనే గ్రామం. ఆదివారం ఆయన తండ్రి సుభాష్ నీలకంఠపురం 75వ జయంతి సందర్భంగా నీలకంఠపురంలో ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే ప్రశాంత్ నీల్‌కి రఘవీరారెడ్డికి సంబంధం ఏంటి? అసలు నీలకంఠపురం గ్రామంతో ప్రశాంత్ నీల్‌కి ఉన్న అనుబంధం ఏంటంటే.. ప్రశాంత్ నీల్ ఎవరో కాదు.. రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడే.

ప్రశాంత్ నీల్ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం వాసి. ప్రశాంత్ నీల్ పేరులోనే నీలకంఠాపురం ఉంది. అదెలా అంటే.. ప్రశాంత్ నీల్ అసలు పేరు.. ప్రశాంత్ నీలకంఠాపురం. ప్రశాంత్ నీలకంఠాపురం పేరు ప్రశాంత్ నీల్‌గా మారింది. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి నీలకంఠాపురం ఇటీవల చనిపోయారు. ఆయనను నీలకంఠాపురంలోనే ఖననం చేశారు. ‘KGF 2’ విడుదల రోజున కూడా స్వగ్రామానికి వచ్చి తన తండ్రి సమాధిని సందర్శించి వెళ్లారు ప్రశాంత్ నీల్. తన బంధువులంతా నీలకంఠాపురం వాసులే కావడంతో తరచూ నీలకంఠాపురం గ్రామానికి వచ్చి వెళ్తుంటారు ప్రశాంత్ నీల్. . ఇటు 75 స్వాతంత్య్ర దినోత్సవం.. అటు తండ్రి 75వ జయంతి కావడంతో సొంత ఊరు నీలకంఠాపురంలో ఉన్న ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు ప్రశాంత్ నీల్.