ధూల్‌పేట పోలీస్‌స్టేషన్‌పై దాడి.. నిందితులు పరార్ - MicTv.in - Telugu News
mictv telugu

ధూల్‌పేట పోలీస్‌స్టేషన్‌పై దాడి.. నిందితులు పరార్

September 27, 2018

హైదరాబాద్‌లోని ధూల్‌పేట మళ్లీ వార్తల్లోకెక్కింది. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది. గుడుంబా, గంజాయి వ్యాపారులు స్టేషన్‌ను ముట్టడించారు. మంగళహాట్‌లో గంజాయి విక్రయిస్తున్న తల్లీకొడకులను ఎక్సైజ్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. వారిని విడిపించేందుకు గురువారం కుటుంబ సభ్యులు, బంధువులు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌పైనే దాడి చేశారు. అంతటితో ఆగకుండా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్, సీఐపై వారు చేయిచేసుకున్నారు.

rrr

ధూల్‌పేటకు చెందిన ఆర్తీబాయి, ఆమె కొడుకు ఉద్దేశ్సింగ్ నిన్నగంజాయి విక్రయిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిద్దరిపైనా కేసులు నమోదు చేసిన పోలీసులు రోజు రిమాండ్కు తరలించేందుకు సిద్ధమయ్యారు. అంతలో వారి ముఠాకు చెందిన  15 మంది పోలీస్ స్టేషన్కు వచ్చారు. కేసులు నమోదు చేయకుండా వారిని వదిలేయాలని కోరారు. గతంలో అరెస్టైనా ఏమాత్రం వారిలో మార్పురాలేదని, రిమాండ్‌కు తరలించి తీరతామని పోలీసులు చెప్పడంతో ఇరువురు మధ్యా వాగ్వాదం జరిగింది. పోలీసులపైన దాడి చేసిన సదరు ముఠా సభ్యులు నిందితులిద్దరినీ విడిపించుకుని తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మంగళహాట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.