‘కొమురం భీముడో’ వీడియో సాంగ్ రిలీజ్ డేట్ వచ్చింది - MicTv.in - Telugu News
mictv telugu

‘కొమురం భీముడో’ వీడియో సాంగ్ రిలీజ్ డేట్ వచ్చింది

May 5, 2022

ఆర్ఆర్ఆర్ సినిమాలో అందరి చేత కంటతడి పెట్టించిన కొమురం భీముడో వీడియో పాటను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బ‌ృందం అధికారికంగా ప్రకటించింది. ఈ పాటలో ఎన్టీఆర్ నటన జాతీయ అవార్డు స్థాయిలో ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. ఇప్పటికే అన్ని పాటల వీడియోలు రాగా, ఈ ఒక్క పాటనే చివర్లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అన్నట్టుగానే ఈ పాటను చివర్లో రిలీజ్ చేస్తున్నారు. ఇదికాక, ఈ చిత్రం త్వరలో ఓటీటీలో రానుంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1100 కోట్ల పైచిలుకు కలెక్షన్లను రాబట్టింది. రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభను మరోసారి చాటారు. ఈ చిత్రం అత్యున్నత నిర్మాణ విలువలతో విమర్శకుల ప్రశంసలు పొందింది.