వీడియో : మన చదువుల్లో నాణ్యత ఇదీ.. టాయిలెట్‌పై విద్యార్ధి వింత సమాధానం - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : మన చదువుల్లో నాణ్యత ఇదీ.. టాయిలెట్‌పై విద్యార్ధి వింత సమాధానం

June 1, 2022

మన ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు విద్యారంగంపై ఖర్చు చేస్తున్నా విద్యార్ధులకు నాణ్యమైన చదువులు అందడం లేదని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. మేధావులు, సామాజిక విశ్లేషకులు ఈ విషయంపై ప్రభుత్వాలను హెచ్చరిస్తూ వచ్చారు. చాలా వరకు విద్యార్ధులకు గడియారం చూసి సమయం చెప్పే తెలివి కూడా లేదని జేపీ నారాయణ చెబుతూ ఉంటారు. ఇలాంటి వ్యాఖ్యలకు నిదర్శనంగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. ఓ రిపోర్టర్ సరదాగా ఓ పాఠశాలకు వెళ్తాడు. అందులో విద్యార్ధుల యోగక్షేమాలు తెలుసుకుంటాడు. వసతుల గురించి, భోజనాల గురించి విచారిస్తాడు. అనంతరం ఓ విద్యార్ధి వద్దకు వెళ్లి మీ నాన్న గారు ఏం చేస్తారు? పాఠశాలలో మంచి నీటి వసతి ఉందా? వంటి ప్రశ్నలను అడుగగా, ఆ విద్యార్ధి చక్కగా సమాధానమిచ్చాడు. తర్వాత రిపోర్టర్.. టాయిలెట్‌ను హిందీలో ఏమంటారో తెలుసా? అని ప్రశ్నించగా, ఆ విద్యార్ధి ఒకసారి తరగతి అని, మరోసారి స్కూలు అని సమాధానమిచ్చాడు. దీంతో రిపోర్టర్‌ ఒక్కసారిగా షాకయ్యాడు. తోటి పిల్లలు విద్యార్ధి సమాధానానికి ఫక్కున నవ్వారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. టీచర్లకు అధిక జీతాలిచ్చి వారిని మేపుతున్నారు కానీ, వారిలో జవాబుదారీ తనం లేదని విమర్శిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)