అట్టహాసంగా ఆస్కార్ వేడుక షురూ. అందరి దృష్టి RRRపైనే.. - MicTv.in - Telugu News
mictv telugu

అట్టహాసంగా ఆస్కార్ వేడుక షురూ. అందరి దృష్టి RRRపైనే..

March 13, 2023

అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ 2023 అవార్డ్స్ వేడుక గ్రాండ్ గా షురూ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా సినీస్టార్స్ తోపాటు భారతీయలు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈవెంట్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో డాల్బీ థియేటర్ వేదికగా ప్రారంభమైంది. షాంపైన్ కార్పెట్ పై సినీతారలు సందడి చేస్తున్నారు. ఇక ఇండియా నుంచి ఆస్కార్ అవార్డుకు నాటు నాటు సాంగ్ ఒరిజినల్ స్కోర్ విభాగం నామినేట్ అయిన సంగతి తెలిసిందే. నేడు ఆస్కార్ వేడుక సందర్భంగా త్రిబుల్ ఆర్ టీం స్టైలిష్ గా రెడీ అయ్యింది. ఈవెంట్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మెరిసారు. దీనికి సంబంధించి ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

ఈ వేడుకకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కూడా హాజరయ్యారు. ఈ గ్లోబల్ ఈవెంట్ లో బ్లాక్ అవుట్ ఫిట్ లో దీపికా మెరిసిపోయింది. తన స్టైలిష్ స్టిల్స్ నతో అభిమానులను కట్టిపడేసింది. ఆస్కార్ ఈవెంట్ కు హాజరైనట్లు తెలిపింది. దీపికాకు ఆస్కార్ అవార్డు ప్రజెంటర్ గా ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే.

ఇక యంగ్ టైగర్ఎన్టీఆర్ బ్లాక్ పాంథర్ సూట్లో స్టైలిష్ లుక్ లో కనిపించారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఈ వేడుకకు ఆయన భార్య ఉపాసనతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఈవెంట్లో ఉపాసనతో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ కూడా ఈ వేడకలో ట్రెడిషనల్ లుక్స్ తో అదరగొట్టారు. సంప్రదాయ దుస్తుల్లో అందర్నీ ఆకట్టుకున్నారు.