The Rs 8 crore car washed away in the floods.. Here is the photo
mictv telugu

వరదల్లో కొట్టుకుపోయిన రూ.8 కోట్ల కారు..ఫోటోలో ఇవిగో

September 30, 2022

మెలారెన్ కంపెనీకి చెందిన పీ1 సూపర్ కారు తాజాగా వరదల్లో కొట్టుకుపోయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, ఆ విలువైన కారు వరదల్లో కొట్టుకుపోతుండగా, ఆ దృశ్యాలను స్వయంగా ఆ కారు యాజమానే వీడియో తీసి, తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ దృశ్యాలను వీక్షిస్తున్న నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ, యాజమానిని ధైర్యపరుస్తున్నారు. ఇంతకి ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకు ఆ కారు యాజమానే ఫోటోలను షేర్ చేశాడు? అనే వివరాల్లోకి వెళ్లే..

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా ఇయన్ హరికేన్ ప్రళయం సృష్టిస్తోంది. హరికేన్ ప్రతాపానికి ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తీవ్రమైన గాలులు, కుండపోత వర్షాలతో ఇళ్లన్నీ నీట మునిగాయి. అంతేకాదు, ఇంటి ముందు పార్క్ చేసిన బైకులు, కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. అయితే, వాహనాలు కొట్టుకుపోతుండగా, పలువురు యాజమానులు కన్నీళ్లు పెట్టుకున్నారే తప్పా, వాటిని రక్షించలేకపోయారు.

ఈ క్రమంలో ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇంటి గ్యారేజ్‌లో పార్క్ చేసిన ఓ ఖరీదైన కారు కొట్టుకుపోవటం అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. వరద ధాటికి కారు కొట్టుకుపోతున్న దృశ్యాలను స్వయంగా ఆ కారు యాజమానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..”నాకు ఎంతో ఇష్టమైన కారు. ఇప్పుడు వరదల్లో కొట్టుకుపోయింది. అది మెలారెన్ కంపెనీకి చెందిన పీ1 సూపర్ కారు. దాని ఖరీదు అక్షరాలా 1 మిలియన్ డాలర్లు. (అంటే ఇండియాన్ కరెన్సీలో దాదాపు 8 కోట్లు). చూస్తుండగానే కనుమరుగైపోయింది” అంటూ రాసుకొచ్చాడు. ఈ ఘటనపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘నన్ను క్షమించండి, ఇది చాలా బాధాకరం. ఇలా జరిగినందుకు చాలా చింతిస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండాలి. కారు పోతే మళ్లీ కొనుక్కోవచ్చు. దానికోసం ప్రయత్నాలు చేసి, మీ ప్రాణాలు పొగొట్టుకోకండి ప్లీజ్’ అంటూ కామెంట్ చేశాడు.