ఉక్రెయిన్‌పై యుద్దంతో అంతర్గత, అంతర్జాతీయ వ్యవహారాలతో బిజీగా ఉండాల్సిన రష్యా ప్రభుత్వం.. తమ అధ్యక్షుడు పుతిన్ ప్రేయసి అలినా కబయేవా పేరిట క్రీడా దినోత్సవం నిర్వహించింది. 69 ఏళ్ల పుతిన్‌కు 38 ఏళ్ల జిమ్నాస్ట్ అలినా కబయేవా ప్రియురాలు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్టు అమెరికా నిఘా వర్గాలు నమ్ముతున్నాయి. అయితే ఇప్పటివరకు పుతిన్ ప్రేయసితో ఉన్న బంధంపై నోరు విప్పలేదు.
యుద్దం మొదలు కాకముందే ఆమెను రహస్యంగా వేరే దేశానికి తరలించాడని టాక్ వచ్చింది. అయితే గత నెలలో జరిగిన క్రీడా దినోత్సవంలో ఆమె కనిపించిందని న్యూస్ వీక్ అనే మీడియా సంస్థ వివరించింది. పాశ్చాత్య మీడియా సంస్థల ప్రకారం.. అలినా కబయేవా రష్యా తరపున అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించిది. ఆ తర్వాత పుతిన్‌తో సాన్నిహిత్యం వల్ల ఆరేళ్లు ఎంపీగా పని చేసింది. అంతేకాక, ప్రభుత్వ జాతీయ మీడియా గ్రూప్ డైరెక్టర్ల బోర్డుకు ఏడేళ్ల పాటు కబయేవా చైర్మెన్‌గా వ్యవహరించారు. అలాంటి కబయేవా గౌరవార్ధం గత నెలలో రష్యా ప్రభుత్వం అలినా ఫెస్టివల్ పేరిట క్రీడోత్సవం నిర్వహించింది. ఈ పోటీలు ప్రభుత్వ టీవీ చానెల్ రష్యా – 1లో ప్రసారమయ్యాయి. వీడియో ప్రకారం.. దేశభక్తి గీతాలు వినిపిస్తుండగా, వందలాది చిన్నారులు, జిమ్నాస్ట్‌లు వేదికపై ప్రదర్శనలు ఇస్తున్నారు. కాగా, వంద రోజులు పూర్తయిన ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా 20 శాతం భూభాగాన్ని ఆక్రమించింది.