నూరేళ్ల క్రితం చనిపోయిన సాధువు నవ్వుతున్నాడు.. అసలు నిజం ఇదీ.. - MicTv.in - Telugu News
mictv telugu

నూరేళ్ల క్రితం చనిపోయిన సాధువు నవ్వుతున్నాడు.. అసలు నిజం ఇదీ..

September 20, 2020

cn vg nb

నూరేళ్ల క్రితం చనిపోయిన సాధువు శరీరం, నవ్వు చెక్కు చెదరలేదని చెప్పే ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను చూసి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.  అత‌డికి ఏవో అతీత శ‌క్తులు ఉన్నాయి కాబట్టి ఆ సాధువు ఇంకా ధ్యాన ముద్ర‌లోనే ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. వందేళ్ల క్రితం పెట్టెలో భ్ర‌ద‌ప‌రిచిన ఇత‌ని‌ శ‌రీరం ఈ మ‌ధ్యే మంగోలియాలోని ఉలాన్‌బాత‌ర్‌లో ల‌భ్య‌మైన‌ట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో దీని గురించి నిపుణులు ఆరా తీయగా అవన్నీ గాలి వార్తలు అని తేల్చారు. 

వాస్తవాలు ఎంటో చెప్పారు. ఈ ఫోటోలో క‌నిపిస్తున్న సాధువు పేరు లుయాంగ్ ఫోర్ పియాన్‌. 2017లో అతడు అనారోగ్యం కార‌ణంగా థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్‌లో ఓ స్థానిక ఆసుప‌త్రిలో మృతిచెందాడు. అయితే అత‌డి మృత‌దేహాన్ని వెంట‌నే ద‌హ‌నం చేయ‌లేదు. బౌద్ధుల ఆచారం ప్ర‌కారం రెండు నెల‌ల పాటు భ‌ద్ర‌‌ప‌రిచారు. అనంతరం ఆ శ‌వానికి కొత్త వస్త్రాలు తొడిగించారు. ఆ సంద‌ర్భంలో తీసిన ఫొటో ఇది. అయితే అన్ని రోజుల త‌ర్వాత కూడా సాధువు శ‌రీరం ఏమాత్రం కుళ్లిపోకుండా ఉంది. అది గమనించి అందరూ షాక్ అయ్యారు. కాగా, సదరు సాధువు చ‌నిపోయిన వంద రోజుల త‌ర్వాత మృత‌దేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు.