Business Idea : చాలీ చాలని జీతం సరిపోవడం లేదా, జాబ్ అయిపోయాక, రెండు గంటలు కష్టపడితే చాలు. నెలకు లక్ష పక్కా.. - MicTv.in - Telugu News
mictv telugu

Business Idea : చాలీ చాలని జీతం సరిపోవడం లేదా, జాబ్ అయిపోయాక, రెండు గంటలు కష్టపడితే చాలు. నెలకు లక్ష పక్కా..

March 10, 2023

ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. ప్రస్తుత కాలంలో సగటు జీవించాలంటే కష్టంగా మారింది. చాలీ చాలని జీతాలతో జీవితం నెట్టుకురావాలంటే భారంగా మారుతోంది. పెరుగుతున్న ధరలతో ఒక ఇంటిని నడపాలంటే…మీకు వస్తున్న జీతం అస్సలు సరిపోదు. అదనపు ఆదాయం కోసం కష్టపడి పనిచేయాల్సిందే. అదనపు ఆదాయం కోసంఏం చేయాలి. ఏం చేస్తే డబ్బు సంపాదించగలమని ఆలోచిస్తున్నారా. అయితే అదనపు ఆదాయం కోసం పనిచేయాల్సిన చిన్న చిన్న వ్యాపారూ ఐడియాలు మీకోసం అందిస్తున్నాం.

మొబైల్ బిర్యానీ సెంటర్ :

నేటి కాలంలో పెద్ద పెద్ద రెస్టారెంట్ల కంటే ఫుడ్ ట్రక్స్ వద్దే తినేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీన్ని మీరు అదనపు ఆదాయంకోసం వ్యాపారంగా మార్చుకోవచ్చు. సాయంత్రం వేడి వేడి రుచికరమైన బిర్యానీ అందుబాటులో ఉంచితే ఎంతో మంది కస్టమర్లు క్యూ కడతారు. అయితే మీరు ఫుల్ టైం లా కాకుండా పార్ట్ టైం కోసం 30 నుంచి 50 ప్లేట్లు బిర్యానీ తయారు చేసుకుని ఫుడ్ ట్రక్ ద్వారా విక్రయించండి. మీకు కావాల్సిన ఆదాయం వస్తుంది.

మిల్క్ డోర్ డెలివరీ:

ఉదయం పూట మిల్క్ ప్యాకెట్లను డోర్ డెలివరీ చేసినట్లయితే అదనపు ఆదాయం సంపాదించుకోవచ్చు. కేవలం ఉదయం కొన్ని గంటలు కష్టపడితే చాలు.

డేటా ఎంట్రీ ఉద్యోగాలు:

ఆన్ లైన్లో అనేక పార్ట్ టైం ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఫీవ్వర్ లాంటి వెబ్ సైట్స్ పార్ట్ టైం జాబ్స్ ను అందిస్తున్నాయి. మీరు పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతున్నట్లయితే..ఆన్ లైన్లో ట్రై చేయడం మంచిది. డేటా ఎంట్రీ ద్వారా మీరు చక్కటి ఆదాయం సంపాదించుకోవచ్చు.

యూట్యూబర్ :

యూట్యూబ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. కుకింగ్ వీడియోలు, ఆర్ట్ క్రాప్ట్ వీడియోలకు మంచి ఆదరణ ఉంది. మీరు టీచర్ అయితే ఆన్లైన్ క్లాస్ లు కూడా చెప్చవచ్చు.

యోగా క్లాస్ టీచర్:

ప్రస్తుత సమాజంలో ఆరోగ్యం పట్ల అవగాహన చాలా పెరిగింది. యోగా క్లాసుల ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు. యోగా టీచర్ గా మారాలంటే మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి.

పిండి వంటలు:

పిండి వంటలతో కూడా అదనపు ఆదాయం సంపాదించుకోవచ్చు. పండగ సీజన్లో పిండివంటలను తయారు చేసి విక్రయించినట్లయితే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.