రాష్ట్ర అవతరణ వేడుకలకు షెడ్యూల్ ఖరారు - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్ర అవతరణ వేడుకలకు షెడ్యూల్ ఖరారు

May 17, 2019

The schedule for Telangana state celebrations has been finalized.

జూన్ 2వ తేదీన జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు కేసీఆర్. ఎప్పటిలా ఉత్సవాలను పరేడ్ గ్రౌండ్స్‌లో కాకుండా.. పబ్లిక్ గ్రౌండ్‌లోని జూబిలీ హాల్‌కు ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించాలని  అధికారులను ఆదేశించారు. మండుతున్న ఎండలను దృష్టిలో వుంచుకుని ఉదయం 9గంటల నుంచి 10.30 మధ్య ఉత్సవాలను నిర్వహించాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేడుకలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.

మొదట అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. 9 గంటలకు పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం జరుగుతాయి. 10.30లకు సీఎస్‌ ఆధ్వర్యంలో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం నిర్వహిస్తారు. 11 గంటలకు జూబిలీ హాలులో రాష్ట్రావతరణ అంశంపై కవి సమ్మేళనం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం పురస్కార ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు.