ప్రపంచాన్ని గజగజవణికించిన కోవిడ్ పుట్టింది చైనాలోని వూహాన్ ల్యాబ్. ఈ ల్యాబ్ నుంచే వైరస్ వ్యాప్తి చెందినట్లు నివేదిక సమర్పించింది యూఎస్ ఎనర్జీ డిపార్ట్ మెంట్. ఈ సంస్థ కొత్తగా సేకరించిన నిఘా సమాచారం మేరకు..ల్యాబ్ లీక్ పై ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో తెలిపింది. ఈ ఎనర్జీ డిపార్ట్ మెంట్ లో అత్యున్నత స్థాయి.. నిపుణులు ఉన్నారు. వీరు సమర్పించిన నివేదిక ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాలో జాతీయ పరిశోధనశాలలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది.
కాగా గతంలో అమెరికాకు చెందిన కొన్ని విభాగాలు కోవిడ్ పుట్టుకపై భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. యూఎస్ ఎనర్జీ డిపార్ట్ మెంట్ కూడా గతంలో కోవిడ్ పుట్టుక ల్యాబ్ లో అనే విషయాన్ని స్పష్టంగా వివరించలేకపోయింది. అయితే తాజాగా ఈ డిపార్ట్ మెంట్ ఇచ్చిన ఐదు పేజీల రిపోర్టులో ఈ విభాగం కూగా చైనావైపే దోషిగా తెలిపింది. తన నెట్ వర్క్ కు సంబంధించి ల్యాబ్ ల నుంచి వచ్చిన సమాచారం మేరకు దీన్ని తయారు చేసింది. కాగా గతంలో ఎఫ్ బిఐ కూడా చైనాలోని ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తూ ఈ వైరస్ లీక్ అయినట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది.
కాగా కోవిడ్ -19 వైరస్ వుహాన్‌లోని బయో-ల్యాబ్ నుండి లీక్ అయి ఉండొచ్చని పేర్కొన్న కొత్త US నివేదికను చైనా కొట్టిపారేసింది. కోవిడ్‌ను రాజకీయం చేయకూడదని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ, చైనా ప్రయోగశాల నుండి మహమ్మారి లీక్ అయి ఉండవచ్చనే సిద్ధాంతాన్ని అంతర్జాతీయ నిపుణులు పరిగణించారని అన్నారు.
ఇది వుహాన్‌లోని ప్రయోగశాలకు క్షేత్ర సందర్శన, పరిశోధకులతో ఇంటెన్సివ్ కమ్యూనికేషన్ తర్వాత WHO-చైనా జాయింట్ మిషన్‌కు చెందిన నిపుణులు సైన్స్ ఆధారిత, అధికారిక ముగింపు అన్నారు. కరోనా వైరస్ ఎక్కువగా వుహాన్‌లోని బయో ల్యాబ్ నుండి లీక్ అయిందని యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ (యుఎస్‌డిఇ) తాజా అంచనాకు ప్రతిస్పందనగా మావో ఈ వ్యాఖ్యలు చేశారు.