కాంగ్రెస్‌కు షాక్ మీద షాక్.. కారెక్కుతున్న మరో ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్‌కు షాక్ మీద షాక్.. కారెక్కుతున్న మరో ఎమ్మెల్యే

March 17, 2019

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోతున్నట్టుగానే వుంది. ఒకరి తర్వాత ఒకరు వరుసగా కారెక్కుతుండటంతో కాంగ్రెస్ పార్టీ డైలమాలో పడింది. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ పార్టీకి షాకిచ్చి గులాబీ కండువా కప్పుకోనున్నారు.

ఖమ్మం జిల్లా కొత్తగూడెం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్న విషయం మరిచిపోకముందే కాంగ్రెస్ పార్టీకి వనమా వెంకటేశ్వర రావు మరో షాకిచ్చారు. ఇప్పటివరకు 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కారు పార్టీలో చేరారు. కందా ఉపేందర్‌ రెడ్డి, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి తదితరులు కాంగ్రెస్‌ను వీడిన విషయం తెలిసిందే.

The shock of the shock to Congress.. Another MLA joining in TRS

ఈ మేరకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో వనమా శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. అనంతరం కాంగ్రెస్‌ను వీడనున్నట్లు లేఖ విడుదల చేశారు. అవసరమైతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరతానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయి కాబట్టే టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈయన కారు ఎక్కడంతో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 19 నుంచి 11కు పడిపోయింది. మరో ఇద్దరు కూడా పార్టీ వీడనున్నట్లు తెలుస్తోంది.