భారత్ పరిస్థితి శ్రీలంకలా ఉంది : రాహుల్ గాంధీ - MicTv.in - Telugu News
mictv telugu

భారత్ పరిస్థితి శ్రీలంకలా ఉంది : రాహుల్ గాంధీ

May 18, 2022

ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, మత హింసల విషయంలో భారత్ శ్రీలంకతో పోటీ పడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని విమర్శించారు. ప్రజల దృష్టిని మార్చడం వల్ల వాస్తవాలు మారబోవని అన్నారు. ఈ మేరకు ఆయన గ్రాఫ్‌లతో కూడిన ట్వీట్ చేశారు.

 

సాయుధ సంఘర్షణ ప్రాంతాలు, ఈవెంట్ డేటా ప్రాజెక్ట్, లోక్‌సభ అన్‌స్టార్డ్ ప్రశ్నలు, పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్, సీఎంఐఈ, శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ ఇచ్చిన సమాచారం ఆధారంగా గ్రాఫ్ రూపొందించినట్టు ఆయన తెలిపారు. వీటిని ఉదాహరణగా చూపిస్తూ ఇండియా కూడా శ్రీలంక బాట పడుతోందనీ, త్వరలో శ్రీలంకలా మారుతుందని రాహుల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.