కరోనా నుంచి రక్షణ.. సరికొత్త మాస్కులు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా నుంచి రక్షణ.. సరికొత్త మాస్కులు

April 7, 2020

The snood that could mask you from infection: Germ-trapping scarf could be the latest way to protect yourself from coronavirus

ఎంతటి ఖరీదైన మాస్క్ అయినా, అదెంత నాణ్యమైన మాస్క్‌ అయినా సరే దానిపై కరోనా వైరస్‌ వారం రోజుల పాటు బతికుండే అవకాశం ఉందంటూ లండన్‌ వైద్యులు తేల్చి చెప్పిన నేపథ్యంలో ప్రజలు మరిన్ని భయాలకు లోనవుతున్నారు. పైగా ఇలాంటి మాస్కులు ధరించడాన్ని కొందరు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. దురద, చెమట పెట్టడంతో మాస్కులు ధరించడాన్ని కొందరు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. వాటిలో కూడా ట్రెండీగా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రొఫెసర్‌ సబీనా ష్లిష్‌ చేసిన సూచనల మేరకు ‘మాంచెస్టర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ’ పరిశోధకులు సరికొత్త మాస్కులను తయారు చేశారు. వీటిని ‘స్నూద్‌’అని పిలుస్తున్నారు. అవి మెడ కింది నుంచి ముఖంపైన కళ్లవరకు ముసుగు ధరించినట్లు ఉండేలా డిజైన్ చేశారు.

‌స్నూద్‌ల గురించి పరిశోధకులు మాట్లాడుతూ.. ‘మనం ముక్కు నుంచి శ్వాసను పీల్చుకునే నాళం పై భాగాన ప్రొటీన్ల మిశ్రమం ఉన్నట్లే ఈ స్నూద్‌కు ప్రొటీన్ల మిశ్రమం పూత ఉంటుంది. అది వైరస్‌లను ఎదుర్కోవడానికి మనకు శక్తిని ఇస్తుంది. అలాగే ప్రొటీన్ల పూతకు పై భాగాన వైరస్‌లను నిర్వీర్యం చేసే రసాయనం ఉంటుంది.  ప్రొటీన్లు ఉన్నప్పుడే కెమికల్‌ రియాక్షన్‌ ఉంటుంది, లేకపోతే లేదు. వీటిని ఏ రోజుకారోజు ఉతుక్కుని మళ్లీ ధరించవచ్చు’ అని వెల్లడించారు. అయితే వాటిని ఎన్ని రోజుల వరకు ధరించవచ్చో, ఎన్ని రోజుల వరకు దానిపై ప్రొటీన్లు, రసాయనం పూత ఉంటుందో వారు చెప్పలేదు. కాగా, ఈ స్నూద్‌లు ఆన్‌లైన్‌ మార్కెట్‌లో 20 పౌండ్లకు (దాదాపు 1800 రూపాయలు) అందుబాటులో ఉన్నాయి.