ఓ సాఫ్ట్వేర్ రూ.3,300 కోట్లు విలువ చేసే ఖాజానాను చెత్తలో పడేసిన సంఘటన ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. కొన్ని రోజులకు అసలు విషయం తెలిసి, వెతుకులాట మొదలుపెట్టాడు. మరి ఇంతకీ ఎవరా ఆ వ్యక్తి? ఆ ఖాజానా ఏంటీ? అసలు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళ్తే..
ఐటీ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న జేమ్స్ హోవెల్స్ అనే వ్యక్తి పదేళ్ల క్రితం కోట్ల విలువైన 8,000 బిట్ కాయిన్ల నిధిని కనుగొన్నాడు. ఎంతో విలువైన ఆ బిట్ కాయిన్లను తన పర్సనల్ హార్డ్ డ్రైవ్‌లో ఉంచాడు. అయితే, అనుకోకుండా ఆ డ్రైవ్‌ను ఓ చెత్తకుండీలో విసిరాడు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి, వెతుకులాటను మొదలుపెట్టాడు. ఎందుకు అంటే..ఆ బిట్ కాయిన్ విలువ (1 బిట్‌కాయిన్ రూ. 18,28,395) అని తెలుసుకుని ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. వెంటనే చెత్త కుప్పలన్నీ వెతికేయటం మొదలుపెట్టాడు. మొత్తం 8 వేల బిట్కాయిన్లు ఉన్నాయి. వాటి ధరను పరిశీలిస్తే, రూ. 8,000 (18,28,395 = 32,91,11,10,000) అంటే దాదాపు (రూ. 3291 కోట్లు) అన్నమాట.
అయితే, జేమ్స్ 2013లో అనుకోకుండా ఈ హార్డ్ డిస్క్‌ని ల్యాండ్‌ఫిల్‌లోకి విసిరేయడంతో హార్డ్ డ్రైవ్ అక్కడే ఉందని సిబ్బందిని జేమ్స్ ఒప్పించాడు. అతను చాలాసార్లు ఇక్కడ తవ్వాలని వారిని వేడుకున్నాడు. న్యూపోర్ట్ కౌన్సిల్ జేమ్స్ ప్రతిపాదనను చాలాసార్లు తిరస్కరించింది. దీని వెనుక పర్యావరణానికి జరిగే నష్టమేమిటని మండలి వాదించింది.
కానీ, జేమ్స్ హోవెల్స్ మాత్రం తన హార్డ్ డ్రైవ్‌ను కనుగొనడానికి సంవత్సరాలుగా చెత్త కుప్పలను జల్లెడ పడుతూనే ఉన్నాడు. ఆ బిట్‌కాయిన్స్ తనకు లభిస్తే, అందులో 10 శాతాన్ని న్యూపోర్ట్ (వేల్స్)లో క్రిప్టో హబ్ నిర్మాణానికి వెచ్చిస్తానని అతను ప్రకటించాడు.