తల్లి కొడుతుందని సుప్రీంకోర్ట్‌కెక్కిన కొడుకు - MicTv.in - Telugu News
mictv telugu

తల్లి కొడుతుందని సుప్రీంకోర్ట్‌కెక్కిన కొడుకు

April 12, 2022

11

ఓ కొడుకు తన తల్లితో మాట్లాడాలని న్యాయవాదులు 45 నిమిషాలపాటు బుజ్జగించిన, తన తల్లితో మాట్లాడానంటే, మాట్లాడాను అంటూ వారిని విసికించాడు. అంతేకాకుండా తన తల్లి ఎంత టార్చర్ పెట్టిందో, రాక్షసిగా మారి, ఎన్ని చిత్రహింసలు పెట్టిందో మీకూ తెలియదు సార్ అంటూ ఆ కొడుకు తన తల్లి గురించి చెప్పిన వాస్తవాలు సుప్రీంకోర్ట్ జడ్జిలను షాక్‌కు గురిచేసిన సంఘటన సంచలనంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోమవారం తన తల్లి తాన పట్ల రాక్షసిగా మారి, చిత్రహింసలు పెడుతుందని, తనకు న్యాయం చేయండి అని కొడుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో షాకైన జడ్జిలు అసలు విషయం ఏం జరిగిందని అడిగారు. దీంతో ఆ కొడుకు ”అమ్మ నన్ను చిన్నప్పుడు విపరీతంగా కొట్టేది. బాత్రూంలో బంధించేది. నాకు మా అమ్మతో మాట్లాడడం ఇష్టం లేదు. నా తల్లిదండ్రులు విడివిడిగానే ఉంటున్నారు. రెండు దశాబ్దాలుగా విడాకుల కోసం కొట్లాడుకుంటున్నారు. నా బాల్యంలో అనేక మానసిక సంఘర్షణలకు లోనయ్యాను” అని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే, తండ్రితో ఉంటున్న అబ్బాయితో మాట్లాడేందుకు అవకాశం ఇప్పించాల్సిందిగా యువకుడి తల్లి తరఫు లాయర్.. కోర్టును కోరారు. అందుకు స్పందించిన జస్టిస్ చంద్రచూడ్.. మాట్లాడాలంటూ సూచించారు. అయితే, 27 ఏళ్ల ఆ యువకుడు తనకు చిన్నప్పుడు జరిగిన సంఘటనలను కోర్టు కళ్లకు కట్టినట్టు వివరించాడు. అనంతరం తల్లి తరఫు న్యాయవాది.. అవన్నీ కట్టుకథలని, అలాంటివేవీ జరగలేదని వాదించారు. అయితే, యువకుడేం చిన్నపిల్లాడుకాదని, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునే విజ్ఞత వచ్చిన వయస్కుడేనని కోర్టు చెప్పింది. యువకుడి తండ్రి ఎలాంటి గొడవల్లేకుండా ప్రశాంతంగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నారని, వీలైనంత త్వరగా విడాకులను మంజూరు చేయాలని కోర్టును కోరారు.