పాటల ప్రయాణం గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

పాటల ప్రయాణం గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది(వీడియో)

February 23, 2020

vbhn vbnh

మైక్ టీవీ, 10 టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న పల్లె పాటల పోటీ కార్యక్రమం ‘ఫోక్ స్టూడియో’. వారం వారం మిమ్మల్ని ఎంతగానో అలరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఫోక్ స్టూడియో ప్రయాణం గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. మిమ్మల్ని మట్టికీ, మమతలకి, ఊరుకీ, చెట్టుకు, పుట్టకు దగ్గర చేస్తూ వచ్చిన ఈ కార్యక్రమం ఇప్పుడు విజేత ఎవరో తేల్చడానికి సిద్ధమైంది. సెమీ ఫైనల్స్‌లో ఎనిమిది మంది పాడగా వారిలోంచి నలుగురిని గ్రాండ్ ఫినాలేకు న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. ఈ నలుగురిలో ఫోక్ స్టూడియో ట్రోఫీని అందుకునేది ఎవరు? ఆ తర్వాతి స్థానాల్లో నిలిచేది ఎవరు? ఇంతవరకు ప్రతీ ఒక్కరు ఎంతో నిబద్ధతతో పాటలు పాడారు. అందరినీ కాచి వడపోసినంత పనేచేశారు మా న్యాయ నిర్ణేతలు.

సెమీ ఫైనల్స్‌లో పాడిన ఆ ఎనిమిది మందిలో నలుగురు గ్రాండ్ ఫినాలేలో పాడుతున్నారు. రఘు, బైరగోని చంద్రం, చిరంజీవి, సుంకపాక ధరణిలు పాడుతున్నారు. ఈ గ్రాండ్ ఫినాలేకు మరింత వైభవాన్ని అద్దడానికి ప్రముఖ యువహీరో అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే మరికొందరు విశిష్ఠ అతిథులుగా ప్రజా గాయకుడు గోరటి వెంకన్న, మైహోమ్ రామేశ్వరరావు, జూపల్లి మేఘన, శ్రీసాయి దీక్షిత డెవ్‌లపర్స్ మార్ల భీంరాజ్‌, టీసాట్ సీఈఓ శైలేష్ రెడ్డి, మైక్ టీవీ అధినేత అన్నపురెడ్డి అప్పిరెడ్డిలు విచ్చేశారు. వారితో పాటు స్పెషల్ పర్‌ఫార్మెన్స్ కింద మన బంగారుతల్లి కనకవ్వ, కడప ముద్దుబిడ్డ స్వాతి పాటలు పాడారు. ఉత్కంఠగా సాగుతున్న గ్రాండ్ ఫినాలే పూర్తి ఎపిసోడ్ కింది లింకులో చూడండి.